యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్‌ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు ధనస్సు ధరించి.. కమలంపై కొలువుదీరాడు.

ఆ దివ్యరూపం సోషల్‌ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయోధ్యలో జరిగిన రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'దండ్వత్ ప్రాణం' (తలను నేలను తాకి నమస్కరించడం) నిర్వహించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)