Surgical Strike Row: దమ్ముంటే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై వీడియోలు బయటపెట్టండి, కాంగ్రెస్ నేత ర‌షీద్ అల్వి డిమాండ్, బీజేపీ ప్ర‌భుత్వాన్ని తాము నమ్మమని వెల్లడి

భారత ఆర్మీ చేటపట్టిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేప‌గా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మ‌రో నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై వీడియో ఉంటే దాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని కాంగ్రెస్ నేత ర‌షీద్ అల్వి డిమాండ్ చేశారు.

Congress leader Rashid Alvi. (Photo/ANI)

భారత ఆర్మీ చేటపట్టిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేప‌గా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మ‌రో నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై వీడియో ఉంటే దాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని కాంగ్రెస్ నేత ర‌షీద్ అల్వి డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాల‌పై జ‌రిగిన సైనిక దాడుల వీడియోను విడుద‌ల చేయాల‌ని కోరారు. మ‌న భ‌ద్రతా ద‌ళాల‌పై త‌మ‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని, అయితే బీజేపీ ప్ర‌భుత్వాన్ని తాము విశ్వ‌సించ‌లేమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వీడియోలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, అందుకే ఆ వీడియోలు బ‌య‌ట‌పెట్టాల‌ని దిగ్విజ‌య్ సింగ్ కోర‌డంలో త‌ప్పేముంద‌ని ర‌షీద్ అల్వి ప్ర‌శ్నించారు.

Here's  Rashid Alvi  Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now