Mukesh Ambani Visit Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ, టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు. ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు భాస్కర్ రెడ్డి అంబానీ వెంట ఉన్నారు. అంతకుముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి అంబానీకి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Advertisement
Advertisement