Vettaiyan Update:రజనీకాంత్ వేట్టయాన్ నుంచి రితికా సింగ్ గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా హీరోయిన్, వీడియో ఇదిగో..

రజనీకాంత్ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం వేట్టయాన్. తెలుగులో వేటగాడుగా వస్తోంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా రితికా సింగ్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రితికా పోషిస్తున్న పాత్ర పేరు రూప. ఆమె ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.

Ritika Singh plays a dashing cop in Rajinikanth's Vettaiyan glimpse Out

రజనీకాంత్ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం వేట్టయాన్. తెలుగులో వేటగాడుగా వస్తోంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా రితికా సింగ్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రితికా పోషిస్తున్న పాత్ర పేరు రూప. ఆమె ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ఆమె శక్తిసామర్థ్యాలు, పోరాడే సత్తాను తెరపైనే చూడాలని చిత్రబృందం క్యాప్షన్ ఇచ్చింది. 3వ వారంలోకి ప్రవేశించిన బిగ్ బాస్ తెలుగు 8, ఎలిమినేషన్‌ రేసులో ఉన్నది వీళ్లే..

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్బన్ వంటి దిగ్గజం కూడా నటిస్తున్నారు. రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్, న్యాయ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న వేట్టయాన్ చిత్రం దసరా సీజన్ లో అక్టోబరు 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now