Sanjay Singh Released From Tihar Jail: జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని, పోరాటం చేయాల్సిన సందర్భమని వెల్లడి
దీంతో ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. దీంతో ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ సింగ్ తండ్రితో పాటు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సైతం జైలు వద్దకు చేరుకున్నారు.జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మద్దతుదారులను, ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని.. పోరాటం చేయాల్సిన సందర్భమన్నారు.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. కేసు విషయంలో మాట్లాడొద్దని.. ఢిల్లీని విడిచి వెళ్లే విచారణ అధికారికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆప్, 4.5 కేజీల బరువు తగ్గారని వెల్లడి
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)