BJP MP Manoj Tiwari: మూడోసారి తండ్రి అయిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారి, లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది, ఆశీర్వదించాలంటూ ట్వీట్

భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

BJP MP Manoj Tiwari (Photo-Twitter)

భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విటర్‌లో ఆయన రాస్తూ..' లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందమైన చిన్నారి జన్మించింది. మా పాపను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు సురభి-మనోజ్ తివారి' అంటూ పోస్ట్ చేశారు. గత నెలలో మనోజ్ భార్య సురభి తివారీ బేబీ షవర్‌ని(సీమంతం) నిర్వహించారు. సురభి- మనోజ్ తివారీకి రెండో భార్య కాగా.. వీరికి 2020లో కూతురు జన్మించింది. అంతకు ముందే రాణి తివారీని 1999లో వివాహం చేసుకోగా.. వారికి రితి అనే కుమార్తె ఉంది.

Here's MP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement