Sudden Death in MP: షాకింగ్ వీడియో, బైక్ మీద వెళుతూ గుండెపోటుతో కుప్పకూలిన పోలీస్ అధికారి, ఎంపీలో విషాదకర ఘటన
మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బైక్‌పై వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీని కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటన రైసెన్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బైక్‌పై వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీని కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటన రైసెన్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ పేరు సుభాష్ సింగ్ (వయస్సు 62 సంవత్సరాలు). అతను బరేలీలో నియమించబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందినవాడు.
గురువారం మధ్యాహ్నం బరేలీ సమీపంలోని ఓ పెట్రోల్ పంపు నుంచి పెట్రోల్ నింపుకునేందుకు వెళ్తున్నాడు.అయితే బైక్ మీద కొంచెం దూరం వెళ్ళగానే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి కొందపడిపోయాడు. ఇది గమనించిన పెట్రోల్ బంక్ ఉద్యోగులు, అక్కడ ఉన్న ప్రజలు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని బరేలీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.
Cop Collapses, Dies of Heart Attack
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)