ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లి పుట్టిన రోజే మృత్యులోకాలకు వెళ్ళిన సంఘటన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చనిపోయింది అని వచ్చిన సమాచారం తో విద్యార్థినీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థినీ తండ్రి చింత అమృత్ రావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డి.ఈ గా విధులు నిర్వహిస్తున్నారు.
Telangana Medical Student’s Suspicious Death in Philippines
ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి
వైద్య విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్నిగ్ధ
పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె స్నిగ్ధ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది
పుట్టినరోజు… pic.twitter.com/DQApslDAIg
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024
సంగారెడ్డి జిల్లా :
పటాన్ చేరు మండలం లోని ఇంద్రేషం లో విషాదం.
ఫిలిప్పీన్స్ దేశంలోని పెర్ఫెక్చువల్ హెల్ప్ యూనివర్సిటీ, మనీలా లో MBBS ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ చింత స్నిగ్ధ అనుమానాస్పద మృతి.
ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లి పుట్టిన రోజే మృత్యులోకాలకు వెళ్ళిన… pic.twitter.com/ypeGMyNpyc
— Telangana Awaaz (@telanganaawaaz) November 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)