Telangana: వీడియో ఇదిగో, భద్రాచలంలో గోదావరి నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, చాకచక్యంగా కాపాడిన స్థానికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం గోదావరి నది వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు యత్నించాడు.వంతెన పైన కూర్చుని దూకేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్లే స్థానికులు అతన్ని మాటల్లో పెట్టారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి బైక్ పార్క్ చేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం గోదావరి నది వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు యత్నించాడు.వంతెన పైన కూర్చుని దూకేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్లే స్థానికులు అతన్ని మాటల్లో పెట్టారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి బైక్ పార్క్ చేశాడు. వెంటనే వెళ్లి వెనుక నుంచి అతన్ని పట్టుకుని వెనక్కి బలంగా లాగాడు. ఈ లోగా అతన్ని మాటల్లో పెట్టిన వ్యక్తులు సైతం వచ్చి అతన్ని పట్టుకున్నారు.దీంతో యువకుడిని చాకచక్యంగా కాపాడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.అయితే అతని ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Police rescue youth who tried to commit suicide
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)