Accident Caught on Camera: మృత్యువు ఎలా వెంటాడుతుందో తెలిపే వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న ఓవర్‌లోడ్ ట్రక్కు బైక్ మీద పడటంతో ఇద్దరు మృతి
విధిరాతను మార్చలేమనే దానికి ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక విషాద ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. ధోల్పూర్ రోడ్డుపై ఓవర్‌లోడ్ తో కూడిన ట్రక్కు ఊగుతూ వచ్చి అదే రోడ్డులో ట్రక్కు ముందు వెళుతున్న బైక్ రైడర్లపై బోల్తా పడింది.

హైడ్రా మెషిన్ సహాయంతో ట్రక్కును తొలగించి, యువకులిద్దరినీ బయటకు తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో ఓ భారీ ఓవర్ లోడ్ ట్రక్కు రోడ్డు మీద వెళ్లడం చూడవచ్చు. దాని ముందు బైక్ రైడర్లు వెళుతున్నారు. అయితే అది ఒక్కసారిగా అదుపుతప్పి వారిద్దరిపైన పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Tragic Accident Caught on Camera in Dholpur
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)