Telangana Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ, 10 మంది మృతి చెందినట్లుగా వార్తలు
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది.
తెలంగాణలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది. లారీ తమ వైపుకు దూసుకు రావడం చూసిన కూరగాయల విక్రయదారులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. అయితే వేగంగా వచ్చిన లారీ పలువురు పైనుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ ఎంత వేగంతో వస్తుందంటే... ఆ వేగానికి అది ఢీకొట్టిన చెట్టు కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.
Tragic Road Accident in Ranga Reddy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)