Turkey Fire: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం, 66 మంది మృతి, మరో 55 మందికి గాయాలు, 12 అంతస్తులు ఉన్న గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో ఎగసిన మంటలు, వీడియో ఇదిగో
టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం(Hotel Fire) చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 66 మంది మృతిచెందగా, 51 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోలో ప్రావిన్సులో ఉన్న 12 అంతస్తులు గల గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో తెల్లవారుజామున 3.30 నిమిషాలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన ఇద్దరు బాధితులు కూడా మృతిచెందారు
టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం(Hotel Fire) చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 66 మంది మృతిచెందగా, 51 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోలో ప్రావిన్సులో ఉన్న 12 అంతస్తులు గల గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో తెల్లవారుజామున 3.30 నిమిషాలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన ఇద్దరు బాధితులు కూడా మృతిచెందారు. గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో మొత్తం 161 రూమ్‌లు ఉండగా 234 మంది గెస్టులు అందులో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
కాగా దేశ రాజధాని ఇస్తాంబుల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరొగ్లు పర్వతాల్లో స్కీయింగ్ రిసార్టు ఉన్నది. ప్రమాదం జరిగిన హోటల్ వద్దకు 30 ఫైర్ ట్రక్కులు, 28 అంబులెన్సులను పంపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Turkey Fire:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)