Uttar Pradesh: అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం, ఐదుమంది అక్కడికక్కడే సజీవ దహనం, మరో 7 మందిని రక్షించిన స్థానికులు, యూపీలో విషాద ఘటన
యూపీలోని మోరాదాబాద్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.దీంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు.
యూపీలోని మోరాదాబాద్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.దీంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లోంచి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు.వీళ్లలో ఐదుగురు గాయాలతో కన్నుమూశారు. మిగతా ఏడుగురిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ శైలేందర్ కుమార్ సింగ్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)