Joe Biden Cries Video: వీడియో ఇదిగో, గాడ్ బ్లెస్‌ అమెరికా అంటూ భోరున ఏడ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు.

Joe Biden Wipes Away Tear (Photo/X/@ChrisDJackson)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు. అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ ‘గాడ్ బ్లెస్‌ అమెరికా’ పాట ఆలపిస్తూ బైడెన్ కంటతడి పెట్టడం, ఆ తర్వాత కన్నీళ్లను తుడుచుకోవడం వీడియోలో కనిపించింది. బైడెన్ మాట్లాడుతూ.. కమాండర్ ఇన్ చీఫ్ గా తాను ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారని అన్నారు. జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదేనని చెప్పారు. తన కుమారుడు బ్యూ బైడెన్ కూడా ఇరాక్ లో ఏడాది పాటు పనిచేశాడని చెప్పారు. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015 లో గ్లియోబ్లాస్టోమా వ్యాధి కారణంగా చనిపోయాడు.

 డొనాల్డ్ ట్రంప్‌ని అభినందిస్తూ ప్రధాని మోదీ పెట్టిన పోస్టుకి 20 మిల్లియన్ల వ్యూస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్

 Joe Biden Wipes Away Tear

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)