Uttar Pradesh: తెల్లవారుజామున కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, శిధిలాల నుంచి క్షేమంగా 12 మంది బయటకు..
దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
యూపీలోని బారాబంకిలో (Barabanki) మూడంతస్తుల భవనం (Building collapse) కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు భవనం కూలిపోయిందని జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ సింగ్ (SP Dinesh Kumar Singh) చెప్పారు. ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చామని, వారిని ఆస్పత్రికు తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారని తెలిపారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకొని ఉండొచ్చని వెల్లడించారు. సహాయకచర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)