Uttar Pradesh: యూపీలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి, మరో 44 మంది తీవ్ర అస్వస్థత, ఏడుగురికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని తెలిపిన డాక్టర్లు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘడ్ జిల్లా మాహుల్ నగర్ పంచాయతీలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మరణించగా, మరో 44 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.ఆసుపత్రిలో చేరిన వారిలో ఏడుగురికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని ఆజంఘడ్ జిల్లా మెజిస్ట్రేట్ అమృత్ త్రిపాఠి చెప్పారు.

Amrit Tripathi, Azamgarh District Magistrate (Photo/ANI)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘడ్ జిల్లా మాహుల్ నగర్ పంచాయతీలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మరణించగా, మరో 44 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.ఆసుపత్రిలో చేరిన వారిలో ఏడుగురికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని ఆజంఘడ్ జిల్లా మెజిస్ట్రేట్ అమృత్ త్రిపాఠి చెప్పారు.కల్తీ మద్యం విక్రయించిన ఇద్దరు వ్యక్తులను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేశామని జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. మద్యం షాపు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారని మెజిస్ట్రేట్ చెప్పారు.తరచూ కల్తీ మద్యం తాగిన వారు అస్వస్థతకు గురవడం ఇటీవల పలుసార్లు జరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now