Uttar Pradesh: చిన్న పిల్లల చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించిన స్కూల్ ప్రిన్సిపాల్, వీడియో వైరల్ కావడంతో చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు
యూపీలో ఓ ప్రైమరీ స్కూల్‌లో హెచ్ఎం ఆ పాఠశాల చిన్నారులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించాడు.హెచ్ఎంకు భయపడి విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
యూపీలో ఓ ప్రైమరీ స్కూల్‌లో హెచ్ఎం ఆ పాఠశాల చిన్నారులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించాడు.హెచ్ఎంకు భయపడి విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంఘటన బల్లియా జిల్లాలోని సోహవాన్ ప్రాంతంలోని పిప్రా కాలా వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఈ విషయంపై బల్లియా జిల్లా ప్రాథమిక విద్యాధికారి మణిరామ్‌సింగ్ మాట్లాడుతూ, తాను వీడియో చూశానని, విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)