Doctor Thrashing Patient: చికిత్స కోసం వచ్చిన రోగిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ కాళ్లతో తన్నిన డాక్టర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
యూపీలో చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని మహోబా జిల్లాలో ఓ ప్రభుత్వ డాక్టర్ రోగిని కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు.
Doctor Kicking, Thrashing Patient Video: యూపీలో చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని మహోబా జిల్లాలో ఓ ప్రభుత్వ డాక్టర్ రోగిని కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..ఆకాష్ ఉపాధ్యాయ అనే రోగి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యం కోసం డాక్టర్ ఆర్పీ సింగ్‌ను సంప్రదించాడు. గోదాన్ ఎక్స్‌ప్రెస్ భోగీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, రైలు నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..
చీటీపై రాసిన మందులు బయట కొనుక్కోవాలని డాక్టర్ ఆర్పీ సింగ్ చెప్పడంతో రోగి ఆకాష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహించిన డాక్టర్ ఆర్పీ సింగ్ తన కుర్చీ నుంచి లేచి రోగి ఆకాష్‌ను కొడుతూ.. కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లాడు.డాక్టర్ రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు రోగిని కొట్టిన డాక్టర్ ఆర్పీ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని రోగి తనను డిమాండ్ చేసినట్లు ఆ డాక్టర్ ఆరోపించాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)