Unnao Shocker: షాకింగ్ వీడియో.. 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు, ఐదేళ్ల చిన్నారిపై ఓ టీచర్ పైశాచికం, చిన్నారి బోరున ఏడుస్తున్నా జుట్టు పట్టుకుని వాయించిన ఉపాధ్యాయురాలు
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను కూడా ఓ తల్లేనని మరచిన ఓ టీచర్ ఐదేళ్ల పసిపాపను చితకబాదింది. ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది.
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను కూడా ఓ తల్లేనని మరచిన ఓ టీచర్ ఐదేళ్ల పసిపాపను చితకబాదింది. ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది. క్లాస్ రూమ్‌లో శబ్ధం చేసిందని, హోం వర్క్ చేయలేదన్న కారణంతో 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంపలు వాయించింది. ఈ క్రమంలో చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆమె అదేదీ పట్టించుకోలేదు. ఓ వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)