Uttarakhand: రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అనంతరం గుడిలో పూజలు చేసిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్, వీడియో ఇదిగో..
ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగం ముఖద్వారం వద్ద ఉంది
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మందిని విజయవంతంగా రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత, అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ స్థానిక దేవత బాబా బోఖ్‌నాగ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తూ కనిపించారు. కార్మికుల్ని రక్షించేందుకు వచ్చిన అమెరికా నిపుణుడు ఆ గుడి వద్ద పూజలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కార్మికుల్ని రక్షించిన తర్వాత ఇవాళ అర్నాల్డ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ గుడి వద్ద దేవుడికి థ్యాంక్స్ చెప్పాలన్నారు. వర్కర్లను రక్షించడం ఓ అద్భుతమని పేర్కొన్నాడు.
ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగం ముఖద్వారం వద్ద ఉంది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 41 మంది నిర్మాణ కార్మికులు సొరంగంలో 17 రోజుల పాటు చిక్కుకుపోయారు.
41 మంది కార్మికులు మంగళవారం రాత్రి బయటకు వచ్చారు. పైప్‌లైన్ ద్వారా వాళ్లను బయటకు లాగేశారు. పైప్‌లైన్ నుంచి కార్మికుల్ని (Trapped Workers) బయటకు తీస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కార్మికులు థమ్స్ అప్ చెప్పారు. 17 రోజుల పాటు కార్మికులు సొరంగంలోనే ఉన్న విషయం తెలిసిందే.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)