Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు ఎలా విరిగిపడుతున్నాయో వీడియోలో, నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్ సేవలు
విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర శాఖల అధికారులు ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి మరోసారి స్పష్టం చేశారు.
ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర శాఖల అధికారులు ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గంగోత్రి జాతీయ రహదారిపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు శిథిలాల కింద పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారు.
సోమవారం రాత్రి, యాత్రికులు గంగోత్రి నుంచి ఉత్తరకాశి కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన స్థానికులు ప్రయాణికులను రక్షించారు అయితే నిరంతరాయంగా రాళ్లు పడుతూ ఉండడం రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా గంగోత్రి జాతీయ రహదారి బందరు సమీపంలో చాలా గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)