Vadodara Boat Capsize: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం, ఎనిమిది మంది విద్యార్థులు మృతి, మొత్తం 27 మంది విద్యార్థులు గల్లంతు

వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్‌ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారని బీజేపీ ఎమ్మెల్యే కెయూర్ రోకాడియా తెలిపారు.

Boat Carrying 27 Children Capsizes in Gujarat’s Harni Motnath Lake, Rescue Operation Launched

గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్‌ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారని బీజేపీ ఎమ్మెల్యే కెయూర్ రోకాడియా తెలిపారు.ఈ సంఘటన గురించి కెయూర్ రోకాడియా మాట్లాడుతూ, "ప్రాథమిక సమాచారం ప్రకారం, పడవలో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సుమారు 7-8 మంది పిల్లలు మరణించారు. తప్పు ఎవరిదైనా శిక్షించబడతారు." వీలైనంత ఎక్కువ మంది పిల్లలను రక్షించడం ప్రాధాన్యత అని కూడా ఆయన అన్నారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు. సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి