'Declare Moon a Hindu Rashtra': వీడియో ఇదిగో, శివశక్తి రాజధానిగా చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి, జిహాదీలు రాకుండా ఉండాలంటే అలా చేయాలని పిలుపునిచ్చిన స్వామి చక్రపాణి మహారాజ్‌

ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Hindu seer Swami Chakrapani Maharaj Wants Moon To Be Declared ‘Hindu Rashtra’ With Chandrayaan-3 Landing Point As ‘Capital’, Urges Parliament To Pass Resolution (Photo-X and ISRO)

ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్‌) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్‌ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు. చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్‌లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్‌ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్‌ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు.

Hindu seer Swami Chakrapani Maharaj Wants Moon To Be Declared ‘Hindu Rashtra’ With Chandrayaan-3 Landing Point As ‘Capital’, Urges Parliament To Pass Resolution

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now