Haryana: వైరల్ వీడియో.. హర్యానాలో నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం, మహిళతో వస్తూ పిస్టల్ తీసి స్నేహితుడిపై కాల్పులు జరిపిన అగంతకుడు, అడ్డు వచ్చిన మహిళపై కూడా కాల్పులు
హర్యానాలో నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నైట్ క్లబ్‌లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్ నుంచి కారు పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్‌ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు.
హర్యానాలో నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నైట్ క్లబ్‌లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్ నుంచి కారు పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్‌ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతే అతడు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్ అతని స్నేహితుడి శరీరంలోకి వెళ్లింది. దీంతో అతని స్నేహితుడి బాధతో విలవిలలాడుతూ కింద పడిపోయాడు.
ఆ వ్యక్తి పక్కనే ఉన్న మహిళా స్నేహితురాలు నివారించేందుకు యత్నించినా ఆమె పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్‌లు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని వద్ద ఉన్న పిస్టల్‌ని లాక్కున్నారు. ఐతే కాసేపటికి గాయపడిన వ్యక్తితో సహా నలుగురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు క్లబ్ తెరిచి ఉన్నందుకు యజమాని పైనా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)