Video: వీడియో ఇదిగో, ఇంటిపై కుప్పకూలిన విమానం, పిల్లర్‌ను ఢీకొట్టి ముక్కలు ముక్కలు,పైలట్ కు, బాలుడికి తీవ్ర గాయాలు

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ సిటీలో ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న విమానం కంట్రోల్ తప్పి ఇంటిపైన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.సిటీ టూర్ లో భాగంగా బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి గ్లైడర్ విమానం బయల్దేరింది. అరకిలోమీటర్ వెళ్లగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది,

plane crashes into house (Photo-Video Grab)

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ సిటీలో ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న విమానం కంట్రోల్ తప్పి ఇంటిపైన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.సిటీ టూర్ లో భాగంగా బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి గ్లైడర్ విమానం బయల్దేరింది. అరకిలోమీటర్ వెళ్లగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది, ఆపై కంట్రోల్ తప్పి ఓ ఇంటి పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలు ముక్కలైంది. విమాన ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యేనని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే, విచారణ పూర్తయితే కానీ ప్రమాదానికి అసలు కారణమేంటనేది తెలియదని చెప్పారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement