BJP leader Gyan Dev Ahuja: షాకింగ్ వీడియో.. 5 గురిని చంపామంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు

రాజస్తాన్‌ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్‌ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

BJP leader Gyan Dev Ahuja (Photo-ANI)

రాజస్తాన్‌ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్‌ ఆహోజా (Rajasthan BJP Ex-MLA) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ హత్యలు లాలావాండి లేదా బెహ్రూర్‌లో కావచ్చు అంటూ రక్బర్‌ ఖాన్‌, పెహ్లూ ఖాన్‌ హత్యలు గురించి వీడియోలో ఆయన (Rajasthan BJP leader Gyan Dev Ahuja) ప్రస్తావించారు.

అంతేకాదు వాటిలో ఒక హత్యను 2017లో మరోకటి 2018లో చేశామని బహిరంగంగా చెప్పారు. అవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్‌గఢ్‌లో జరిగిందని చెప్పడం విశేషం. కాగా తమ కార్యకర్తలకు చంపడానికి స్వేచ్ఛ ఇచ్చానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారు హత్య చేసిన వెంటనే బెయిల్‌ పొందడమే గాక నిర్దోషులుగా విడుదలవుతారని చాలా ధీమాగా చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement