West Bengal Rains: బెంగాల్‌లో కుండపోత వర్షాలు, భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది మృతి, ఎక్స్ వేదికగా సంతాపం తెలిపిన సీఎం మమతాబెనర్జీ
ఉరుములు, మెరుపులు (thunderstorm), ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి.భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం (Heavy Rain) కురిసింది. ఉరుములు, మెరుపులు (thunderstorm), ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి.భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్‌లో ఐదుగురు, పశ్చిమ్ మెదినీపూర్‌లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు ప్రాణలు కోల్పోయినట్లు చెప్పారు. నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు, వచ్చే మూడు నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)