Madhya Pradesh High Court: బిడ్డను కనాలి, జైల్లో ఉన్న నా భర్తను బయటకు పంపండి, సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ కోర్టును ఆశ్రయించిన ఓ మహిళ

సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని అభర్థించింది.

Law (Photo-File Image)

Woman Seeks Company Of Jailed Husband To Beget A Child: బిడ్డను కనేందుకు తన భర్తను జైలు నుంచి బయటకు పంపాలని కోరుతూ ఓ మహిళ మధ్యప్రేదశ్‌ హైకోర్టును ఆశ్రయించింది. సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని అభర్థించింది. నంద్ లాల్ Vs కేసులో రాజస్థాన్ హైకోర్టు ఆదేశం ప్రకారం సంతానోత్పత్తికి ప్రాథమిక హక్కు అని కోరింది.

మహిళ పిటిషన్‌పై అక్టోబర్ 27న విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. బిడ్డను కనడానికి ఆ మహిళ ఆరోగ్యంగా ఉందో? లేదో? పరీక్షించాలని ఐదుగురు డాక్టర్లతో కూడిన బృందాన్ని కోరింది. అయితే.. రికార్డ్‌ల ప్రకారం మహిళ మోనోపాజ్‌(బుుతుక్రమం) వయస్సు దాటిపోయిందని ప్రభుత్వ న్యాయవాది సుబోధ్ కథార్ తెలిపారు.వైద్యుల రిపోర్టు నవంబర్ 7న రానున్నాయి. వైద్యుల రిపోర్టు తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది.

Here's Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)