CM Ramesh on YSRCP: ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భగవంతుడు శిక్ష వేసినా వారికి భయం లేదు, అంబటి రాంబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఎంపీ సీఎం రమేష్

Ambati Rambabu and CM Ramesh (Photo-X)

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఈరోజు తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అయితే, ఆయ‌న మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫొటో ఉన్న స్టిక్క‌ర్‌తో తిరుమ‌ల‌కు వెళ్లారు. రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, స్టిక్క‌ర్ల‌తో స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌డం టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. అయినా అంబ‌టి త‌న ష‌ర్ట్‌పై జ‌గ‌న్ ఫొటో ఉన్న స్టిక్క‌ర్‌తో రావ‌డం అనేది ఇప్పుడు చ‌ర్చనీయాంశమ‌వుతోంది.

వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్

తిరుమలలో అంబటి రాంబాబు తీరుపై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం ఉన్నప్పటికీ అంబటి రాంబాబు పార్టీ గుర్తుతో పాటు జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జ్‌తో ఆలయంలోకి రావడం దారుణమన్నారు. అంబటికి భగవంతుడిపై నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భగవంతుడు శిక్ష వేసినా వారికి భయం లేదని విమర్శించారు.

CM Ramesh Fire on YSRCP

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now