Nepali Girls Dance to 'Kurchi Madathapetti' Song: కుర్చీ మడతపెట్టి పాటకు నేపాల్ యువతులు డ్యాన్స్ వీడియో వైరల్, అదిరిపోయే స్టెప్పులు వేసిన అమ్మాయిలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అదిరిపోయే స్టెప్ లు వేశారు నేపాల్ యువతులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అదిరిపోయే స్టెప్ లు వేశారు నేపాల్ యువతులు. దీనికి సంబంధించిన వీడియో (Nepali Girls Dance to 'Kurchi Madathapetti' Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ముఖ్యపాత్రలో నటించిన గుంటూరు కారం సినిమా గత సంక్రాంతికి విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అయితే టీవీలో మాత్రం ఈ కాంబో సినిమాలు అత్యధిక రేటింగ్ తో దుమ్మురేపాయి.
ఇక గుంటూరు కారం సినిమా యావరేజ్ అయినా అందులోని పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ (Kurchi Madathapetti) 2024 సంవత్సరంలో యూట్యూబ్‌లో అత్యధికంగా ప్లే అయిన పాటగా నిలిచింది. యూట్యూబ్ అధికారికంగా విడుదల చేసిన టాప్ సాంగ్స్ జాబితాలో ఇండియా నుంచి కుర్చీ మడత పెట్టి మాత్రమే నిలిచింది.సినిమా వచ్చి ఏడాది అయ్యింది, పాట వచ్చి ఏడాది కంటే ఎక్కువగానే అయ్యింది. అయినా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కుర్చీ మడత పెట్టి సాంగ్‌కి స్టెప్స్ వేస్తూనే ఉన్నారు.
Nepali Girls Dance to 'Kurchi Madathapetti' Song:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)