Hardik Patel Joins BJP: బీజేపీ కండువా కప్పుకున్న హర్దిక్‌ పటేల్, తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరేముందు హార్దిక్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

Hardik Patel Join BJP (Photo Credits: ANI)

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరేముందు హార్దిక్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం కోసం ఒక చిన్న సైనికుడిగా పనిచేయనున్నట్లు తెలిపారు. యావత్‌ ప్రపంచానికే మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ అన్నారు.

28 ఏళ్ల యువ పాటిదార్‌ నేత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2020లో గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకయ్యారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయాలపై అసంతృప్తి చెందిన హర్దిక్‌ బహిరంగంగా ఆ పార్టీని విమర్శిస్తూ వచ్చారు. కొన్ని రోజులకు(మే 18న) కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement