Himachal Election Result 2022: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్‌ , కాసేపట్లో తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తానని వెల్లడి

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం దిశగా ఎన్నికల ఫలితాలు సాగుతున్నాయి. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే 16 సీట్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ 13 స్థానాల్లో గెలిచి, 13 స్థానాల్లో ముందంజలో ఉంది.

CM Jairam Thakur (Photo-ANI)

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం దిశగా ఎన్నికల ఫలితాలు సాగుతున్నాయి. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే 16 సీట్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ 13 స్థానాల్లో గెలిచి, 13 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల ఇతరులు గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లోనూ హిమాచల్‌ప్రదేశ్‌ ఓటర్లు ఆనవాయితీగా మరోసారి కొనసాగించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సీఎం జైరాం ఠాకూర్‌ రాజీనామా చేశారు. కాసేపట్లో తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తానని వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement