MLA Maganti Gopinath Attacked with Sandal: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి.. వీడియో వైరల్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి జరిగింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ పాల్గొన్నారు.
Hyderabad, May 10: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) పై చెప్పుతో దాడి జరిగింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ పాల్గొన్నారు. అదే సమయానికి బోరబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ప్రచారం నిర్వహిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక కార్పొరేటర్ కొంత మంది మహిళలను రెచ్చగొట్టడంతో గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పు విసిరి దాడి చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)