Newdelhi, May 10: షాప్ లో చిప్స్ (Chips), స్నాక్స్ (Snacks), మ్యాగీ చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. కమ్మటి ఆ రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అనుకుంటాం. ఇక చల్లగా ఉండే ఫిజీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ (Cool Drinks) ను ఎప్పుడెప్పుడు తాగుదామా అనుకోని వారు ఉండరు. అయితే మీకు అలర్ట్. ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తింటే మీ జీవితకాలాన్ని కోల్పోతున్నట్టే. ఆయుక్షీణం కొని తెచ్చుకున్నట్టే. అకాల మరణ ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే. 30 ఏండ్లపాటు సాగిన ఓ అధ్యయన నివేదిక ఈ మేరకు వెల్లడించింది. ఈ వివరాలు బీఎంజే జర్నల్ ప్రచురించింది.
Beware! Ultra processed food can lower lifespan and raise risk of early death, claims study https://t.co/Hj7WR0EJl5
— Zee News English (@ZeeNewsEnglish) May 9, 2024
అలా ఆరోగ్యం దెబ్బతింటుంది
అధ్యయనం ప్రకారం.. ఉప్పు, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ సరైనపాళ్లలో అందకపోవడం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఊబకాయం, షుగర్, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఇది అకాల మరణానికి దారితీయొచ్చు.