Hyderabad, Sep 5: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులను దోచుకుంటూ పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న(Sajjanar Press Meet on Petrol Scam) ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బంకుల్లో (petrol pumps) ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ముఠాను (Huge Fraud At Petrol Pumps ) సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓట్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 13 బంకులను, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేశామని తెలిపారు. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, ఆర్‌సీపురంలలో 11 బంకుల్లో చిప్‌లను గుర్తించామన్నారు. అత్యాధునిక చిప్‌లతో పెట్రోల్ బంకుల్లో మోసాలు చేస్తున్నారని సీపీ సజ్జనార్ (Cyberabad CP Sajjanar) చెప్పారు. పెట్రోల్ తక్కువ వచ్చి.. మీటర్ కరెక్ట్‌గా చూపించేలా చిప్‌లు ఏర్పాటు చేశారని వెల్లడించారు.
Here's V.C.Sajjanar Press Meet
#Live #PressMeet by V.C.Sajjanar IPS., Commissioner of Police, Cyberabad on Interstate Gang indulging irregularities in petrol bunks by installing IC chips and cheating public busted by #SOT_Cyberabad
— Cyberabad Police (@cyberabadpolice) September 5, 2020
మహారాష్ట్ర నుంచి బంకుల నిర్వాహకులు ప్రత్యేక చిప్‌లు తెప్పించుకున్నారని, కోట్ల రూపాయల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. క్యాన్, బాటిల్‌లో మాత్రం కరెక్ట్ ఉన్న పంప్ దగ్గరకు పంపిస్తారని తెలిపారు. లీటర్ పెట్రోల్‌కు 30 మి.లీ నుంచి 40 మి.లీ దాకా తక్కువ కొలతలు వస్తున్నాయని పేర్కొన్నారు. అక్రమాలకుపాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్ నమోదు చేశామని సజ్జనార్ చెప్పారు.
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ హైకోర్టులో భౌతికంగా కేసులు విచారణ
ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌లో 970 ఎమ్ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్‌ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని వెల్లడించారు. లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని తెలిపారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులు అమర్చారని సజ్జనార్ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు.
ఏలూరుకు చెందిన శుభాని అతని గ్యాంగ్ ఈ స్కామ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్పుల్ని తయారు చేయించారని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో చిప్లు అమర్చినట్లు విచారణలో తేలిందన్నారు.ఆయిల్ కార్పొరేషన్ సర్ప్రయిజ్ విజిట్ చేయటం ద్వారా ఈ మోసాన్ని కనిపెట్టలేరు. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని’ సజ్జనార్ వివరాలను వెల్లడించారు.