2024 భారతదేశం ఎన్నికలు: గత పదేళ్ళ గాయానికి మీ ఓటుతో చికిత్స చేయండి, మీ శక్తిమంతమైన ఓటుతో ద్వేషాన్ని ఓడించి ప్రేమ దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్‌ (Polling) జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు

Rahul Gandhi (Photo-ANI)

2024 భారతదేశం ఎన్నికలు: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్‌ (Polling) జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు. ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  కోయంబత్తూరులో ఓటు హక్కును వినియోగించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్, వీడియో ఇదిగో..

ఈ పదేళ్లలో దేశ ఆత్మపై జరిగిన గాయాలపై మీ ఓటుతో మందు పూయాలని చెప్పారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. మీ ప్రతి ఓటు భారతదేశ ప్రజాస్వామ్యాన్నే కాకుండా తరతరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Here's Rahul Gandhi Tweet

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement