Monthly Aid For Women: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకం.. గృహిణులకు ప్రతి నెల 1000 రూపాయలు.. సెప్టెంబరు 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు.. బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్ల కేటాయింపు
తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళల కోసం ‘మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ. 1000 చొప్పున పంపిణీ చేస్తారు.
Chennai, March 21: తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం మహిళల కోసం బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళల కోసం ‘మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ. 1000 చొప్పున పంపిణీ చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులైన మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అన్నాదురై (CN Annadurai) జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) దీనిని ప్రారంభిస్తారు. ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్టు సమాచారం.
Viral Video: డ్యాన్స్ చేస్తుండగానే సడెన్‌గా గుండెపోటు.. తర్వాత ఏమైంది? భోపాల్ లో ఘటన.. వీడియోతో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)