UP Nurse Grabs Woman Patient: మహిళా రోగిని జుట్టుపట్టుకొని లాక్కొచ్చి పడేసిన నర్సు, ఉత్తరప్రదేశ్‌ ఆస్పత్రిలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో, నర్సు తీరుపై సర్వత్రా విమర్శలు

ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో మహిళ పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Video) అయ్యింది. మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్ ఆర్కే సింగ్ ఈ చర్యను సమర్థించారు

Sitapur, OCT 28: ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో (UP Hospital) దారుణం జరిగింది. ఓ మహిళా రోగి పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. మహిళా రోగి జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోసింది. వివరాళ్లోకి వెళ్తే.. ఈ నెల 18న మహిళా రోగిని సీతాపూర్ జిల్లా ఆస్పత్రిలో (Sitapur district hospital) అడ్మిట్‌ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో మహిళ పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Video) అయ్యింది. మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్ ఆర్కే సింగ్ ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని పేర్కొన్నారు. దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత సాధారణ స్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం మహిళను డిశ్చార్జ్‌ చేసినట్లు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement