New Blood Test: ఒక్క రక్తపరీక్షతో అన్ని రోగాలు గుర్తించొచ్చు.. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా!
ఇదే పరీక్షతో మానవ అవయవాల వయస్సును, చాలా ముందుగానే భవిష్యత్తు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కనుగొనవచ్చని నిరూపించారు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు.
Newdelhi, Dec 10: ఆరోగ్య సమస్యలను (Health Issues) త్వరగా గుర్తించడానికి రక్త పరీక్ష (Blood Test) దోహదపడుతుంది. ఇదే పరీక్షతో మానవ అవయవాల (Organs) వయస్సును, చాలా ముందుగానే భవిష్యత్తు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కనుగొనవచ్చని నిరూపించారు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు. వీరి నేతృత్వంలోని పరిశోధకులు మానవ రక్తంలో ప్రొటీన్ స్థాయిలను విశ్లేషించారు. రక్త పరీక్ష ద్వారా శరీరంలోని అవయవాల జీవ సంబంధమైన వయస్సును నిర్ధారించవచ్చని వీరు చెబుతున్నారు. అనారోగ్యానికి గురయ్యే ముందే చికిత్స చేసేందుకు ఈ విధమైన రక్త పరీక్ష దోహదం చేస్తుందని తెలిపారు. అంతే కాకుండా అల్జీమర్స్ లాంటి వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని, వ్యాధి పురోగతి తీవ్రతను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. ఈ నూతన రక్త పరీక్ష ద్వారా ముందుగానే అవయవాల (అనారోగ్య) క్లినికల్ లక్షణాలు తెలుసుకుని చికిత్సను అందించే వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.
Indian Army Using AI: సరిహద్దుల్లో ఏఐతో నిఘా.. భారత ఆర్మీ కీలక నిర్ణయం?!