Hand Writing Brain Connection: చేతిరాతతో చురుకైన మెదడు.. టైపింగ్ కంటే చేతిరాతతో మెదడు ఎంతో ఉత్తేజితం.. నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో వెల్లడి
ఏదైనా విషయాన్ని, కంటెంట్ ను టైపింగ్ చేసే బదులు చేత్తోనే రాయండి.
Newdelhi, Jan 29: మీ మెదడు(Brain)ను ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే చేతిరాతతో (Hand writing) రాయడాన్ని కొనసాగించండి. ఏదైనా విషయాన్ని, కంటెంట్ ను (Content) టైపింగ్ (Typing) చేసే బదులు చేత్తోనే రాయండి. ‘కీ బోర్డ్ మీద టైపింగ్ తో పోలిస్తే చేత్తో రాస్తున్నప్పుడు మెదడు అనుసంధానం మరింత విస్తృతంగా ఉంది. ఇలాంటి అనుసంధానం జ్ఞాపకశక్తికి, కొత్త సమాచారాన్ని విశ్లేషించడానికి కీలకం. నేర్చుకొనేందుకు ప్రయోజనకరం’ అని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు తెలిపారు. చేతిరాత, టైపింగ్ లో ఉన్న నాడీ సంబంధమైన నెట్ వర్క్ ను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)