Newdelhi, Sep 20: ‘బ్రెయిన్ స్ట్రోక్’ (Brain Stroke) మరణాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. జీవన శైలి వ్యాధులు దీనికి ప్రధాన కారణంగా ఇప్పటివరకూ అనుకొన్నాం. అయితే, గాలి కాలుష్యం (Air Pollution), అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’ తాజా కథనం పేర్కొన్నది. బ్రెయిన్ స్ట్రోక్ కి ప్రధాన కారకాలుగా ఉన్న అధిక బరువు, రక్తపోటు, శారీరక శ్రమలేకపోవటం మొదలైనవాటిని పెంచటంలో గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఇలా చేయొచ్చు!!
1990 తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 72 శాతం పెరగడానికి అధిక ఉష్ణోగ్రతలూ ఒక కారణమని గణాంకాలు చెబుతున్నాయి. 1990లో 73 లక్షల మందికి తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ రాగా, వీరి సంఖ్య 2021నాటికి 1.19 కోట్లకు చేరుకుంది. శుభ్రమైన గాలి, బహిరంగంగా పొగతాగటాన్ని నిషేధించటం వంటివి ‘బ్రెయిన్ స్ట్రోక్’ బారినపడే ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.
మనుషుల శరీరంలో 3,600కు పైగా ఫుడ్ ప్యాకేజింగ్ రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి