Micro Plastic (Credits: X)

Newdelhi, Sep 20: ప్లాస్టిక్ (Plastic) రక్కసి మానవ శరీరాన్ని చిద్రం చేస్తున్నది. ఆహార ప్యాకేజింగ్ లో వాడే 3,600కు పైగా రసాయనాలను (Packaging Chemicals) మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇందులో సుమారు 100 దాకా ఆరోగ్యానికి హానికరమైనవి ఉన్నాయని తేల్చి చెప్పింది. వీటిలో పీఎఫ్‌ఏఎస్‌, బిస్ఫెనాల్‌ ఎ లాంటి నిషేధిత జాబితాలో ఉన్న రసాయనాలు కూడా గుర్తించినట్టు అధ్యయనం పేర్కొంది. ఫుడ్‌ ప్యాకేజింగ్‌ ద్వారానే శరీరంలోకి ఈ రసాయనాలి చొచ్చుకుపోయాయని అధ్యయనం తెలిపింది.

ఇలా చేస్తే మేలు

శరీరంలోకి ప్యాకేజింగ్ రసాయనాలు చేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశోధకులు తెలిపారు. ప్యాకేజీ సామగ్రిని ఎక్కువ సేపు వాడొద్దని సూచించారు. ప్యాకేజ్డ్‌ ఆహారాన్ని వేడి చేయడాన్ని నివారించాలని తెలిపారు.