Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు.

Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..
Filmfare Awards 2024 Full List of Winners (Credits: X)

Gandhinagar, Jan 29: గుజరాత్‌ (Gujarath) లోని గాంధీనగర్‌ (Gandhinagar) లో బాలీవుడ్‌ (Bollywood) 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక (Filmfare Awards 2024 Full List of Winners) అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’, విక్రాంత్ మాస్సే నటించిన ‘12th ఫెయిల్’ సినిమాలు అవార్డులను కొల్లగొట్టాయి. అలియా భట్ ఉత్తమ నటిగా(రాకీ ఔర్ రాణి ), రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా(యానిమల్) నిలిచారు. ఇక ‘12th ఫెయిల్’ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. పలువురు సెలబ్రిటీలు ఈ అవార్డ్స్‌ వేడుకకు హాజరయ్యారు.

Vijay Political Debut: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్, రాజకీయ పార్టీకోసం ఇప్పటికే అప్లై చేసుకున్న విజయ్ మక్కల్ ఇయక్కం, లోక్ సభ ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా పావులు

అవార్డుల జాబితా ఇదే..

  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
  • ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
  • ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

Lok Sabha Elections 2024: ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయనున్న 96 కోట్ల మంది ఓటర్లు, వారిలో 47 కోట్ల మంది మహిళలే, వివరాలను వెల్లడించిన ఎన్నికల కమిషన్ 

(The above story first appeared on LatestLY on Jan 29, 2024 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).