Ayodhya Temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్.. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం
అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్ లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
Ayodhya, Nov 20: అయోధ్య రామమందిరంలో (Ayodhya Temple) శ్రీరాముడి విగ్రహ (Lord Ram) ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్ లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే, కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం జరిగింది. వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి ముందుకు తీసుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. జనవరి 22న దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)