Newdelhi, Nov 20: పంజాబ్ లో (Punjab) పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్ లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్ బజాజ్ (Vinod Bajaj) (73) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో (World Record) రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. నడకలో ఇప్పటికే ఓసారి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆయన.. తాజాగా 1,114 రోజుల్లో ఒంటరిగా 80 వేల కిలోమీటర్లకుపైగా నడిచి తన రికార్డును తానే అధిగమించాడు. ఇది భూగోళాన్ని రెండుసార్లు చుట్టివచ్చినంత దూరానికి సమానం. గత వారం ఈ ఫీట్ ను పూర్తిచేసిన వినోద్ బజాజ్.. దీన్ని ‘డబుల్ ఎర్త్ వాక్’గా అభివర్ణించారు. ఈ ఫీట్ ను గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయించేందుకు దరఖాస్తు చేశారు. 2020 సెప్టెంబర్ లో ఫస్ట్ ఎర్త్ వాక్‌ను 1,496 రోజుల్లో వినోద్ బజాజ్ పూర్తిచేశారు.
#Punjab-born #Irish man eyes #Guinnessrecord for double ‘Earth Walk’ https://t.co/V4iSNR63Gh
— The Tribune (@thetribunechd) November 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)