Ayodhya Ramanavami: రామనవమి రోజు అయోధ్యకు రావొద్దు.. భక్తులకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి.. ఎందుకంటే?
వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.
Ayodhya, Apr 16: ఈ నెల 17న శ్రీరామ నవమి (Ramanavami) నేపథ్యంలో రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య (Ayodhya) నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి దూరదర్శన్ లో ప్రసారమయ్యే ప్రత్యప్రసారం ద్వారా వేడులకను వీక్షించాలని కోరింది. ఈ మేరకు రామ నవమి నాడు అయోధ్యలో జరిగే పూజ-హారతి కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)