Madurai Horror: ఎంత ఘోరం!! మారథాన్ తరువాత బీటెక్ విద్యార్థికి గుండెపోటు.. మృతి.. తమిళనాడులోని మదురైలో ఘటన

తమిళనాడులోని మదురైలో ఘోరం జరిగింది. మారథాన్ పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఆదివారం ఉదయం తమిళనాడు మంత్రులు ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు.

Heart Attack. (Photo Credits: Pixabay)

Madurai, July 24: తమిళనాడులోని (Tamilnadu) మదురైలో (Madurai) ఘోరం జరిగింది. మారథాన్ (Marathan) పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి (B.Tech Student) గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. ఆదివారం ఉదయం తమిళనాడు మంత్రులు ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు. కల్లకురిచికి చెందిన యువకుడు దినేశ్ కుమార్ ఈ మారథాన్‌ ను విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్‌ రూంలోకి వెళ్లాడు. ఆ తరువాత బాత్రూమ్‌ లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు. దీన్ని స్నేహితులు గుర్తించి బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.  అప్పటికే దినేశ్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు.

Hyderabad Shocker: ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి యువకుడి మృతి.. బైక్‌ పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స.. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వీడియోతో..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement