Libya Floods: తూర్పు లిబియాలో భారీ వరదలు.. 2 వేల మంది మృతి.. వేలాదిమంది గల్లంతు.. డ్యామ్ తెగడంతో డెర్నా నగరంలోకి వరద.. సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. ఇళ్లు.. 10 అడుగుల మేర ముంచెత్తిన వరద
వరదలతో దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు.
Newdelhi, Sep 12: భారీ తుపాను, ఎడతెరిపి లేని వానలతో కారణంగా తూర్పు లిబియా (Libya) అతలాకుతలం అవుతుంది. వరదలతో (Floods) దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు. డెర్నా నగరంలోకి వరద భారీగా ముంచెత్తడంతో ఆ ప్రాంతంలో దారుణ నష్టం సంభవించింది. డెర్నా పైన ఉన్న డ్యామ్ లు కూలడంతో ఈ విపత్తు సంభవించినట్టు లిబియన్ నేషనల్ ఆర్మీ (ఎల్ఎన్ఏ) తెలిపింది. వరదల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు పేర్కొంది. వరద 10 అడుగుల మేర ముంచెత్తినట్టు స్థానికులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)