Earthquake: లడఖ్ లో స్వల్పంగా కంపించిన భూమి.. చిట్టగాంగ్ లో 5.6 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
Newdelhi, Dec 2: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో (Ladakh) భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అటు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ లో (Chittagong) భారీ భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్ లోని రామ్ గంజ్ లో భూమి కంపించింది (Earthquake). రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు.