Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

Plane spotted flying over Lord Venkateswara Swamy temple (photo-RTV)

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానాయాన శాఖ పట్టించుకోవడం లేదు.

అలంపూర్ దేవాలయంలో విషాదం, దర్శనం కోసం వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి, చెత్తబండిలో మృతదేహం తరలింపు

తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై నుంచి విమానాలు వెళ్తుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (గురువారం) తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం పై నుంచి ఓ విమానం వెళ్లింది. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు.ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలకమండలి ద్వారా కేంద్ర విమానాయాన శాఖకు విజ్ఞప్తి చేశారు.

Plane spotted flying over in Tirumala

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now